Home News నీతి,నిజాయితీ గల వాళ్లే టీడీపీలో చేరుతున్నారు – ముఖ్యమంత్రి చంద్రబాబు

నీతి,నిజాయితీ గల వాళ్లే టీడీపీలో చేరుతున్నారు – ముఖ్యమంత్రి చంద్రబాబు

74
0

టీడీపీ నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్రజా ప్రతినిధులు,బూత్ కన్వీనర్లు,పార్టీబాధ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ…నీతి,నిజాయితీ గల వాళ్లే టీడీపీలో చేరుతున్నారు. అవినీతి పరులు, నేరస్తులే వైసీపీకి పోతున్నారు. స్వార్ధం కోసం వచ్చిన వారే టీడీపీని వీడారు. నేర రాజకీయాలతో సమాజానికి నష్టం. అన్ని ప్రాంతాలలో దశాబ్దాల వైరం వీడారు. విబేధాలు వీడి టీడీపీతో కలిసి నడుస్తున్నారు. కర్నూలులో కోట్ల, కెఈ కుటుంబాలు-కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు, విజయనగరంలో బొబ్బిలి,గజపతి రాజులు-అరకులో కిషోర్ చంద్రదేవ్,శత్రుచర్ల రాజులు

అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిశారు. తెలుగుదేశంపార్టీకి సంఘీభావం తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉందనే వీళ్లంతా టీడీపీకి మద్దతు తెలియ‌చేస్తున్నారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి . ఈ స్ఫూర్తి అన్ని నియోజకవర్గాలలో రావాలి. వ్యక్తిగత విభేదాలకు స్వస్తి చెప్పాలి. ఇది కలిసి పనిచేసే సమయం. బాక్సైట్ తవ్వకాల వెనుక నిజాలను కిషోర్ చంద్రదేవ్ చెప్పారు. వైఎస్ కుటుంబమే బాక్సెట్ తవ్వకాలకు సూత్రధారి. బాక్సెట్ తవ్వకాల పై కిషోర్ చంద్రదేవ్ అడ్డుకున్నారు. లైసెన్స్ లు రద్దు చేయించలేక పోయానన్న కిషోర్ చంద్రదేవ్. లైసెన్స్ లు రద్దు చేసిన ఘనత టిడిపిదే అన్నారు. ఈ నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వైసీపీ ముసుగు తొలగించాల్సింది గిరిజనులే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here