Home Uncategorized  నీవెవ‌రో విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారు..!

 నీవెవ‌రో విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారు..!

96
0
Neevevaro release date

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో, హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం నీవెవ‌రో. ఈ చిత్రానికి హ‌ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్,  ఎమ్ వీవీ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమా పోస్ట‌ర్ ను ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ మూవీ ప్ర‌తి క్ష‌ణం ఇంట్ర‌స్టింగ్ గా, ఊహించ‌ని మ‌లుపుల‌తో ఉంటుంద‌ని తెలిసింది.

ఆది, తాప్సీ, రితికా సింగ్..ఈ ముగ్గురి కెరీర్ లో ఈ సినిమా ఓ స్పెష‌ల్ మూవీలా నిలిచేలా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని ఆగ‌ష్టు 24న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అంతే కాకుండా…నీవెవ‌రో ఆడియ‌న్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి..నీవెవ‌రో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here