Home Actor నువ్వు మాస్ అయితే.. నేను డ‌బుల్ మాస్ అంటూ భ‌య‌పెడుతున్న లారెన్స్..!

నువ్వు మాస్ అయితే.. నేను డ‌బుల్ మాస్ అంటూ భ‌య‌పెడుతున్న లారెన్స్..!

70
0


కొరియోగ్రాఫ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..హీరోగా, డైరెక్ట‌ర్ గా, రైట‌ర్ గా,  ప్రొడ్యూస‌ర్ గా..ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో స‌క్స‌స్ సాధిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న గొప్ప మాన‌వ‌తావాది రాఘ‌వ లారెన్స్. మాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన లారెన్స్ ముని సినిమాతో హ‌ర్ర‌ర్ జోన‌ర్ లో సినిమా తీసి…ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నారు.

కాంచ‌న‌, కాంచ‌న 2 చిత్రాల‌తో సూప‌ర్ స‌క్స‌స్ సాధించిన లారెన్స్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కాంచ‌న 3. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బి.మ‌ధు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు. సస్పెన్స్, హార్ర‌ర్, యాక్షన్ సన్నివేశాల పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నెరిసిన గెడ్డం మీసాలతో.. కాస్త వయసు మళ్లిన లుక్ తో లారెన్స్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రత్యేకత ఈ లుక్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్ కనిపిస్తున్నాడు.

నువ్వా నేనా అన్నట్టుగా ఈ ఇద్దరి మధ్య సీన్స్ వుంటాయనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. నువ్వ మాస్ అయితే..నేను డ‌బుల్ మాస్ అంటూ లారెన్స్ భ‌య‌పెడుతున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 19న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..కాంచ‌న‌, కాంచ‌న 2 చిత్రాల వ‌లే కాంచ‌న 3 కూడా సూప‌ర్ స‌క్స‌స్ సాధిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here