Home Political News నేడు నిజామాబాద్ లో కేసీఆర్ స‌భ – క‌విత ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు పూర్తి..!

నేడు నిజామాబాద్ లో కేసీఆర్ స‌భ – క‌విత ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు పూర్తి..!

89
0
726228-kcr-rally-trs-twitter

టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వరుస బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఆయన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు క‌విత ఆధ్వ‌ర్యంలో అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయ‌ని స‌మాచారం. సుమారు 2 లక్షల మంది ఈ స‌భ‌కు హాజరవుతారనే అంచనాతో పట్టణంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు.

దాదాపు 100 మంది ఆసీనులయ్యే విధంగా వేదికను సిద్ధం చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ కోసం హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేసేందుకు ఎంపీ కవిత వారం నుంచి నిజామాబాద్‌లోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి… జనసమీకరణ పై దృష్టిపెట్టారు. సభా ప్రాంగణం వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1300 మందికి పైగా పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ స‌భ జ‌ర‌గ‌నుంది.

గురువారం నల్లగొండ సభలో, శుక్రవారం వనపర్తి సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటార‌ని స‌మాచారం. అనంతరం ఒక రోజు విరామం తర్వాత ఆయన 7న వరంగల్‌ సభలో, 8న ఖమ్మంలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఈ రెండు సభలను పార్టీ పరమైన కారణాల వల్ల వాయిదా వేసే యోచనలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here