Home Telugu ‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు..!

‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు..!

109
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ – హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం నేల టిక్కెట్టు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా నేల టిక్కెట్టు ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ లో రిలీజ్ చేసారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడ్రా.. కాని సాయం చేసేవాడు ఒక్కడూ లేడు’.. అందుకే చుట్టూ జనం మ‌ధ్య‌లో మనం’, ముస‌లిత‌నం అంటే చేత‌కాని త‌నం కాదురా…నిలువెత్తు అనుభ‌వం అంటూ ర‌వితేజ చెప్పిన డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి.

ర‌వితేజ ఎన‌ర్జీ ఎలా ఉంటుందో తెలిసిందే. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా కామెడీ, ఎమోష‌న్, యాక్ష‌న్,సెంటిమెంట్…ఇలా ప్రేక్ష‌కుల‌కు కోరుకునే అన్ని అంశాల‌తో నేల టిక్కెట్టు రూపొందిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మాళవిక శర్మ అందం అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు మరోసారి ప‌వ‌ర్ పుల్ రోల్ లో క‌నిపించ‌నున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని రూపొందించార‌ని ట్రైల‌ర్ ని చూస్తే తెలుస్తుంది.

ర‌వితేజ సినిమా అంటే ఆడియ‌న్స్ ఏం ఆశిస్తారో..అవ‌న్నీ ఉన్న‌ట్టు అనిపిస్తుంది. నేల టిక్కెట్టు గాళ్ల‌తో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అనే డైలాగ్ మాస్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అవుతుంది. మ‌రి…సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం…చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన‌ క‌ళ్యాణ్ కృష్ణ  నేల టిక్కెట్టు తో హ్యాట్రిక్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here