Home Movie Reviews నోటా రివ్యూ..!

నోటా రివ్యూ..!

136
0

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ఆక‌ట్టుకుని..పెళ్లి చూపులు సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి..అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించి..గీత గోవిందం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న యువ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా తెలుగు, త‌మిళ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన పొలిటిక‌ల్ ఫిల్మ్ నోటా. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై జ్ఙాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ  అంచ‌నాలతో నోటా ఈరోజు (అక్టోబ‌ర్ 5)  ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి..నోటా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుందా..?  విజ‌య్ కి మ‌రో విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – వాసుదేవ్ (నాజ‌ర్) తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఆయ‌న జాత‌కాల‌ను బాగా న‌మ్ముతారు. అయితే..ఆయ‌న జాత‌కం ప్ర‌కారం గ్ర‌హాలు అనుకూలంగా లేనందున కొన్ని రోజుల పాటు త‌న వార‌సుడిని ముఖ్య‌మంత్రి సీటులో కూర్చొబెట్ట‌మ‌ని…అలా చేస్తే ఆత‌ర్వాత చాలా బాగుంటుంద‌ని  ఓ బాబా చెబుతారు. బాబా చెప్పిన‌ట్టే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి వాసుదేవ్ రాజీనామా చేసి ఆ సీటులో త‌న కుమారుడు వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ను రాత్రికి రాత్రి ముఖ్య‌మంత్రిని చేసేస్తాడు. రాజ‌కీయాలంటే అస‌లు ఇష్టం లేని వ‌రుణ్ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి అవుతాడు. ఆత‌ర్వాత వాసుదేవ్ ఓ కేసులో చిక్కుకుని జైలుకి వెళ్లాల్సి వ‌స్తుంది. బెయిల్ నుంచి వ‌స్తుంటే..వాసుదేవ్ పై బాంబు దాడి జ‌రుగుతుంది.  దీంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వాసుదేవ్ కోమాలోకి వెళ‌తాడు. త‌న తండ్రి పైనే కాకుండా త‌న పైన ఫ్యామిలీ మెంబ‌ర్స్ పైనా కూడా దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇంటిలిజెన్స్ నుంచి వ‌రుణ్ కి స‌మాచారం అందుతుంది. దీని వెన‌క వేల కోట్ల‌కు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయ‌ని తెలుసుకుంటాడు వ‌రుణ్.  దీంతో త‌న‌కు ఇష్టం లేక‌పోయినా కొన్ని రోజులే క‌దా అని సీఎంగా ఉండేందుకు అంగీక‌రించిన వ‌రుణ్ కి అస‌లు ప‌రీక్ష ఎదుర‌వుతుంది. అయితే..వ‌రుణ్ కి మ‌హేంద్ర (స‌త్య‌రాజ్) అండ‌గా ఉంటాడు. అస‌లు..మ‌హేంద్ర ఎవ‌రు..?  ఎందుకు వ‌రుణ్ కి అండ‌గా ఉన్నాడు. త‌న తండ్రి పై దాడి వెన‌కున్న కుట్ర ఏమిటి..?  ఏమాత్రం రాజకీయ అనుభ‌వం లేని వ‌రుణ్ ఆ కుట్ర‌ను ఎలా చేధించాడు..?   అనేదే మిగిలిన క‌థ‌

ప్ల‌స్ పాయింట్స్

విజ‌య్ న‌ట‌న‌

నేప‌ధ్య సంగీతం

కొన్ని డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్

సాంగ్స్

హీరోయిన్ క్యారెక్ట‌ర్

క్లైమాక్స్

విశ్లేష‌ణ – అస‌లు రాజ‌కీయాలంటే ఇష్టంలేని ఓ యువ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే అత‌ని ప‌రిస్థితి ఎలా ఉంటుంది అనే పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పూర్తి న్యాయం చేసాడు. పార్టీ కార్య‌క‌ర్త‌లు చేసిన అల్ల‌ర్లు వ‌ల‌న స్కూల్ కి వెళ్లే ఓ పాప చ‌నిపోయిన‌ప్పుడు చ‌లించిపోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స‌న్నివేశంలో విజ‌య్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. అలాగే ప్ర‌తిప‌క్షం త‌న పై చేసిన కుట్ర‌కు కౌంట‌ర్ ఇచ్చే స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఇక హీరోయిన్ మెహ‌రీన్ టీవీ జర్నలిస్ట్ గా న‌టించింది. నాలుగైదు స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది త‌ప్పా..ఆ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేదు. విజ‌య్ కి అండ‌గా ఉండే పాత్ర‌లో స‌త్య‌రాజ్, తండ్రి పాత్ర‌లో నాజ‌ర్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. మిగిలిన పాత్ర‌ధారులు వారి వారి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో చూపించడం.. అలాగే అవిశ్వాసం టైమ్ లో  ఎమ్మెల్యేను ఓ రిసార్ట్స్ లో ఉంచ‌డం..త‌దిత‌ర స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఫ‌స్టాఫ్ ఇంట్ర‌స్టింగ్ గా బాగానే అనిపించినా సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి డైరెక్ట‌ర్ ఆనంద్ శంక‌ర్ త‌డ‌బ‌డ్డాడు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజ‌య్ తో పొలిటిక‌ల్ ఫిల్మ్ చేయ‌డం ఓ సాహ‌స‌మే అని చెప్ప‌చ్చు. అయితే…ఏ క‌థ అయినా ఇంట్ర‌స్టింగ్ గా చెబితే ఆడియ‌న్స్ చూస్తారు కానీ.. ఈ క‌థ‌ను ఇంట్ర‌స్టింగ్ గా చెప్ప‌డంలో డైరెక్ట‌ర్ ఫెయిల్ అయ్యార‌నే చెప్ప‌చ్చు. దీనికి నోటా అనే టైటిల్ పెట్టారు కానీ…ఎక్క‌డా ఆ ప్ర‌స్ధావ‌నే ఉండ‌దు.సి.ఎన్.శామ్ సంగీతం, జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణం బాగున్నాయి. టోట‌ల్ గా నోటా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…నోటాలో ఏదో ఉంటుంది అనుకుంటే నిరాశే..!

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here