Home Actor న‌న్ను చంపినా..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఆప‌లేరు – వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

న‌న్ను చంపినా..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ఆప‌లేరు – వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

141
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోని కీల‌క ఘ‌ట్టాలు క‌థాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ టీజ‌ర్ & ట్రైల‌ర్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం..బాల‌కృష్ణ న‌టించిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీ సెకండ్ ట్రైల‌ర్ ను హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ‌ర్మ త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సినిమా ఆపాలనుకుంటే తనను చంపేయాలని వ్యాఖ్యానించారు. అలాంటిది ఏదైనా జరిగితే దానికి కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచించి పెట్టానన్నారు.

ఇంత‌కీ ఆ ఆలోచ‌న ఏంటంటే…ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి త‌న‌కేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీ రాసి పెట్టార‌ట వ‌ర్మ‌. అందువల్ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ బయటకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు అని వర్మ స్పష్టం చేశారు. అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఎన్నో అంచనాలు ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here