Home Movie Reviews న‌న్ను దోచుకుందువ‌టే రివ్యూ..!

న‌న్ను దోచుకుందువ‌టే రివ్యూ..!

71
0
DnmhLN9X0AAhdQX

సుధీర్ బాబు – న‌భా న‌టేశ్ జంట‌గా న‌టించిన చిత్రం న‌న్ను దోచుకుందువ‌టే. ఈ చిత్రం ద్వారా ఆర్.ఎస్.నాయుడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఈ చిత్రాన్ని సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సుధీర్ బాబు నిర్మించారు. స‌మ్మోహ‌నం స‌క్స‌స్ త‌ర్వాత సుధీర్ బాబు న‌టించిన చిత్రం కావ‌డం.. అలాగే నిర్మాత‌గా తొలి చిత్రం కావ‌డంతో న‌న్ను దోచుకుందువ‌టే చిత్రం పై రిలీజ్ కి ముందు నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ రోజు (సెప్టెంబ‌ర్ 21)న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి..న‌న్ను దోచుకుందువ‌టే సుధీర్ బాబుకి విజ‌యాన్ని అందించిందా..? లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – కార్తీక్ (సుధీర్ బాబు) త‌క్కువ మాట్లాడుతూ..ఎక్కువ ప‌ని చేసే సాఫ్ట్ప వేర్ ఎంప్లాయ్. త‌న కింద ప‌ని చేసేవారికి కార్తీక్ ఆఫీస్ కి వ‌స్తున్నాడంటే భ‌యం. కార్తీక్ కి యు.ఎస్ వెళ్లాల‌నేది గోల్. త‌న ఉద్యోగం, త‌న ల‌క్ష్యం త‌ప్పా మిగ‌తా విష‌యాల‌ను అంత‌గా ప‌ట్టించుకోడు. ఇక మేఘ‌న (న‌భా న‌టాశ్) ఓ వైపు కాలేజీలో చ‌దువుకుంటూ మ‌రో వైపు షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించే చ‌లాకీ అమ్మాయి. కార్తీక్ ది త‌క్కువ మాట్లాడుతూ సీరియస్ గా ఉండే వ్య‌క్తిత్వం అయితే…మేఘ‌న ఎక్కువగా మాట్లాడుతూ ఎప్పుడూ స‌ర‌దాగా న‌వ్వుతూ ఉండే అమ్మాయి. కార్తీక్ కి, మేఘ‌న ఎవ‌రో తెలియ‌దు. అలాంటిది ఓ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం కార్తీక్ సిరి అనే అమ్మాయిని ప్రేమించాన‌ని ఇంట్లో చెబుతాడు. కార్తీక్ తండ్రి సిరిని చూడ‌డం కోసం హైద‌రాబాద్ వ‌స్తే…మేఘ‌న‌ను సిరిగా ప‌రిచయం చేస్తాడు. కార్తీక్ సిరిని ప్రేమించాన‌ని తండ్రికి ఎందుకు అబ‌ద్ధం చెప్పాల్సి వ‌చ్చింది..?  మేఘ‌న సిరిగా మారిన త‌ర్వాత ఏం జ‌రిగింది.?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

సుధీర్ బాబు, న‌భా న‌టేశ్ న‌ట‌న‌

వైవా హ‌ర్ష కామెడీ

అజ‌నీశ్ లోక‌నాథ్ సంగీతం

సుధీర్ బాబు నిర్మాణం

సురేష్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

పాత సినిమాలు గుర్తుకురావ‌డం

అక్క‌డ‌క్క‌డా స్లోగా అనిపించ‌డం

విశ్లేష‌ణ – త‌న ల‌క్ష్యం త‌ప్పా..వేరే ప్ర‌పంచం గురించి అంత‌గా ప‌ట్టించుకోని క్యారెక్ట‌ర్ లో సుధీర్ బాబు చాలా బాగా న‌టించాడు. ముఖ్యంగా న‌వ‌ర‌సాల్లో ఏ ఒక్క ర‌సం కూడా ద‌గ్గ‌రికి రాకుండా న‌టించే స‌న్నివేశంలో సుధీర్ బాబు, వైవా హ‌ర్ష‌ ఆడియ‌న్స్ ని క‌డుపుబ్బా న‌వ్వించారు.ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే..న‌భా న‌టేశ్ మేఘ‌న‌, సిరి పాత్ర‌లో న‌టించింది అన‌డం కంటే..ఆ పాత్రలో ప్ర‌వ‌ర్తించింది అన‌డం క‌రెక్ట్. ఎప్పుడూ న‌వ్వుతూ చ‌లాకీగా ఉండే అమ్మాయి పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌ట‌న చూస్తుంటే…బొమ్మ‌రిల్లు సినిమాలో హాసిని క్యారెక్ట‌ర్ గుర్తొస్తుంటుంది. డైరెక్ట‌ర్ నాయుడు పాత క‌థే అయిన‌ప్ప‌టికీ ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నంతో పాటు ఆద్యంతం ఆస‌క్తిగా ఉంటూ అంద‌ర్నీ న‌వ్వించేలా క‌ధ‌నం రాసుకోవ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విజ‌యం సాధించాడ‌ని చెప్ప‌చ్చు. కాక‌పోతే..క‌ధ‌నం అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దిగా సాగిన ఫీలింగ్ క‌లిగిస్తుంది. క‌మెడియ‌న్ వేణు, ప్ర‌భాస్ శీను పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఎంట‌ర్ టైన్ చేసాయి. సుధీర్ బాబు నిర్మించిన ఈ తొలి చిత్రాన్ని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో నిర్మించాడు. సుధీర్ బాబుకు తండ్రిగా నాజ‌ర్ న‌టించారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య చిత్రీక‌రించిన ఎమోష‌న‌ల్ సీన్  ప్రేక్ష‌కులకు బాగా క‌నెక్ట్ అవుతుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీలా కాకుండా…స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌కు ముఖ్యంగా యూత్ కి మంచి చెప్పాల‌ని ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు చేసిన ప్ర‌య‌త్నం అభినంద‌నీయం. తుల‌సి, జీవా, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. టోట‌ల్ గా న‌న్ను దోచుకుందువ‌టే గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…క్లాస్ ఆడియ‌న్స్ మ‌న‌సుల‌ను బాగా దోచుకునే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్.

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here