Home Actor న‌రేష్, రాజశేఖ‌ర్ ప్యాన‌ల్ కు స‌పోర్ట్ చేస్తున్న నాగ‌బాబు. ఎందుకో తెలుసా..?

న‌రేష్, రాజశేఖ‌ర్ ప్యాన‌ల్ కు స‌పోర్ట్ చేస్తున్న నాగ‌బాబు. ఎందుకో తెలుసా..?

100
0


మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మద్దతు నరేష్, రాజశేఖర్ ప్యానల్ కు ఉంటుందని ప్రకటించారు. దానికి కారణాలు కూడా చెప్పారు. ఇంత‌కీ నాగాబాబు ఏం చెప్పారంటే… మా అధ్యక్ష పదవి అనేది ఒక్కరు ఒక్కసారి మాత్రమే చేయాలి. రెండోసారి చేయడం తనకు నచ్చదని చెప్పారు. ప్రతి ఒక్కరికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని.. అందుకే తాను నరేష్, రాజశేఖర్ కు సపోర్ట్ చేస్తున్నాను అన్నారు.

తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌పుడు కూడా రెండోసారి చేయ‌మంటే చేయ‌న‌ని చెప్పాన‌ని చెప్పాను. దానికి తోడు ఈ ప్యానల్లో జీవిత గారికి మంచి హోదా ఇస్తున్నారు.. ఆడవాళ్లను గౌరవించుకోవడం మన బాధ్యత. ఇప్పటి వరకు మా అసోసియేషన్ లో మహిళలకు తగిన పదవి ఇవ్వలేదు. ఇప్పుడు నరేష్ వర్గం అది చేస్తున్నారు కాబట్టి తన సపోర్ట్ వాళ్లకు ఇస్తాను. వీళ్లు వచ్చి ఏదైనా కొత్తగా చేస్తారేమో.. ఒక అవకాశం ఇచ్చి చూస్తే మంచిది క‌దా అన్నారు.

గతంలో జనరల్ సెక్రటరీగా నరేష్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. కాబట్టి ఆయనకు మళ్లీ మద్దతిస్తున్నాను. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన రాజశేఖర్ గారు.. అలాగే ఒకప్పటి జంధ్యాల గారి సినిమాల‌తో పాటు ఇప్పటికీ నటిస్తున్న నరేష్ గారు.. ఎన్నో సినిమాలు తెరకెక్కించి నటించిన జీవిత గారికి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు మెగా బ్రదర్.

గ‌త అసోసియేష‌న్ వ‌ర్గంతో తాను డిస‌ప్పాయింట్ అయ్యాన‌ని.. ఎవ‌రు ప‌డితే వాళ్లు వ‌చ్చి మా అసోసియేష‌న్ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటే వాళ్లు చూస్తూ ఉన్నారు కానీ… యాక్ష‌న్ తీసుకోలేద‌ని చెప్పారు నాగ‌బాబు. అందుకే ఈ ఒక్క విష‌యంలో తాను నిరాశ‌ప‌డ్డాన‌ని.. మీడియా కూడా అప్పుడు మాకు వ్య‌తిరేకంగా మాట్లాడితే న‌రేష్, జీవిత గారు మాట్లాడార‌ని గుర్తు చేసారు. ఈ సారి కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే వాళ్లేం చేస్తారో కూడా తెలుస్తుంది క‌దా.. అలా కాకుండా ముందే మీరు చేయ‌లేర‌ని చెప్ప‌డం మంచిది కాద‌న్నారు నాగ‌బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here