Home Movie News @న‌ర్త‌న‌శాల టైటిల్ వెన‌కున్న సీక్రెట్ ఇదే..!

@న‌ర్త‌న‌శాల టైటిల్ వెన‌కున్న సీక్రెట్ ఇదే..!

97
0
Naga-Shaurya-as-gay-in-Nartanasala

ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య న‌టించిన చిత్రం @న‌ర్త‌న‌శాల‌. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా రూపొందిన @ న‌ర్త‌న‌శాల‌కు ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సోష‌ల్ మీడియాలో ఫ‌స్ట్ లుక్ & ట్రైల‌ర్ కి విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్రం లో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ చిత్రానికి @న‌ర్త‌న‌శాల అనే టైటిల్ పెట్ట‌డం వెన‌కున్న సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు నాగ‌శౌర్య‌. ఇంత‌కీ ఆ సీక్రెట్ ఏంటంటే..న‌ర్త‌న‌శాల టైటిల్ తో సినిమా చేయాల‌నుకున్న చాలా సినిమాలు ఆగిపోయాయి. అందుచేత ఈ సినిమాకి న‌ర్త‌న‌శాల అనే టైటిల్ పెట్ట‌డం క‌న్నా@న‌ర్త‌న‌శాల అని పెడితే బాగుంటుంద‌ని నాగ‌శౌర్య‌కి వాళ్ల ఫాద‌ర్ చెప్పార‌ట‌. అంతే కాకుండా..ఈ మూవీ స్టోరీకి క‌రెక్ట్ గా స‌రిపోయే టైటిల్ ఇదే. అందుకే ఈ టైటిల్ పెట్టామ‌ని చెప్పాడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here