Home Movie News @న‌ర్త‌న‌శాల రివ్యూ..!

@న‌ర్త‌న‌శాల రివ్యూ..!

103
0
@Narthanasala review

ఛ‌లో సినిమాతో సూపర్ స‌క్స‌స్ సాధించిన త‌ర్వాత నాగ‌శౌర్య న‌టించిన సినిమా @న‌ర్త‌న‌శాల‌. ఈ చిత్రంలో నాగ‌శౌర్య స‌ర‌స‌న క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ న‌టించారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని ఉష మూల్పూరి నిర్మించారు. ఛ‌లో త‌ర్వాత సినిమా కావ‌డం..ట్రైల‌ర్ ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి..@న‌ర్త‌న‌శాల నాగ‌శౌర్యకి మ‌రో విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది తెలియాలంటే క‌థ చెప్పాల్సిందే.

క‌థ – క‌ళామందిర్ క‌ళ్యాణ్ (శివాజీరాజా) త‌న భార్య‌కు కూతురు పుడుతుంది అనుకుంటాడు. ఆయ‌న తండ్రి కూడా మ‌న‌వ‌రాలే పుట్టాల‌ని కోరుకుంటాడు. అయితే..కొడుకు పుట్టాడ‌ని తెలుసుకున్న క‌ళామందిర్ క‌ళ్యాణ్ ఈ విష‌యం తెలిస్తే త‌న తండ్రి చ‌నిపోతాడ‌ని అస‌లు విష‌యం చెప్ప‌కుండా మ‌న‌వ‌రాలే పుట్టింద‌ని తండ్రికి చెబుతాడు. ఓసారి అనుకోకుండా జాత‌కాలు చెప్పే కోయివాడు ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు క‌ళామందిర్ క‌ళ్యాణ్ త‌న కూతురికి ఎలాంటి మొగుడు వ‌స్తాడో చెప్ప‌మంటే…గెట‌ప్ వేసి అబ్బాయిని అమ్మాయి అని చెప్పినంత  మాత్రాన అస‌లు విష‌యం తెలియ‌ద‌నుకుంటున్నావా..? అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టి నీ కొడుక్కి త‌గ్గ మొగుడే వ‌స్తాడ‌ని చెప్పి వెళ్లిపోతాడు. అది విని క‌ళ్యాణ్, అత‌ని తండ్రి షాక్ అవుతారు. పెద్ద‌యిన త‌ర్వాత హీరో నాగ‌శౌర్య…అమ్మాయిలు వాళ్ల‌ని వాళ్లే ర‌క్షించుకోవాల‌నే ఉద్దేశ్యంతో క‌రాటేలో ట్రైనింగ్ ఇస్తుంటాడు.
మాన‌స‌  (క‌శ్మీర ప‌ర‌దేశి) ని నాగ‌శౌర్య ప్రేమిస్తుంటాడు. అలాగే రాయుడు కూతురు స‌త్య‌ (యామినీ భాస్క‌ర్) హీరో ప్రేమ‌లో ప‌డుతుంది. అయితే..క‌ళ్యాణ్ త‌న కొడుకు స‌త్య‌ని ప్రేమిస్తున్నాడ‌నుకుని వీళ్లిద్ద‌రికి పెళ్లి ఖాయం చేస్తాడు. ఆత‌ర్వాత హీరో త‌ను గే అని పెళ్లి చేసుకోలేన‌ని చెబుతాడు. ఇది నిజ‌మా..?  లేక  అలా చెప్పాడా..?  ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..?  అనేదే మిగిలిన క‌థ‌

ప్ల‌స్ పాయింట్స్

నాగ‌శౌర్య, అజ‌య్ న‌ట‌న‌

జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి కామెడీ

విజ‌య్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్

క‌థ‌, క‌థ‌నం

విశ్లేష‌ణ –  హీరో గే క్యారెక్ట‌ర్ చేయ‌డం అనేది కొత్తే కానీ…మిగిలిన క‌థ‌, క‌థ‌నంలో మాత్రం కొత్త‌ద‌నం చూపించ‌లేదు. డైరెక్ట‌ర్ శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి గే క్యారెక్ట‌ర్ తో కామెడీ చేయించి…ఆడియ‌న్స్ ని న‌వ్వించేస్తే సినిమా స‌క్సస్ అయిపోతుంది అనుకుని ఈ క‌థ రాసుకున్న‌ట్టు అనిపిస్తుంది. అలాగే క‌ళామందిర్ క్యారెక్ట‌ర్ లో శివాజీరాజా యాక్టింగ్ న‌వ్విస్తుంది కానీ…ప్ర‌తిదానికి ఓవ‌ర్ గా రియాక్ట్ అవుతున్న‌ట్టు అనిపిస్తుంటుంది. ఇత‌నే కాదు..జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఇంట్లో ఉన్న‌వారింద‌రి న‌ట‌న అతిగా అనిపిస్తుంది. ఎక్క‌డా..స‌హ‌జ‌త్వం అనేదే క‌నిపించ‌దు. హీరో నాగ‌శౌర్య మాత్రం నార్మ‌ల్ క్యారెక్ట‌ర్, గే క్యారెక్ట‌ర్ రెండింటిలోను బాగా న‌టించాడు. ఇక హీరోయిన్స్ ఇద్ద‌రూ క‌శ్మీర ప‌ర‌దేశి, యామిని భాస్కర్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. ఈ సినిమాకి వెళ్లిన ఆడియ‌న్ కి ఎంట‌ర్ టైన్ మెంట్ అంటే జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి పాత్రే. మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం బాగుంది. ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని మంచి క్వాలిటీతో నిర్మించారు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్రఫి వ‌ర్క్ బాగుంది. టోట‌ల్ గా @న‌ర్త‌న‌శాల గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన @న‌ర్త‌న‌శాల‌..!

రేటింగ్ – 2/5

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here