Home Political News న‌వంబ‌ర్ 2 నుంచి జ‌న‌సేనాని రైలు ప్ర‌యాణం.!

న‌వంబ‌ర్ 2 నుంచి జ‌న‌సేనాని రైలు ప్ర‌యాణం.!

92
0

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫేస్ బుక్ ద్వారా జ‌న సైనికులు, యువ‌తీ యువ‌కులు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో ఫేస్ బుక్ లో అఫిషియ‌ల్ పేజీని ప్రారంభించారు. ఈ పేజీ ద్వారా పార్టీ సిద్ధాంతాలు త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా తెలియ‌చేస్తారు. ఈ పేజీలో తొలి విష‌యంగా తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన అప్ డేట్ పోస్ట్ చేసారు. న‌వంబ‌ర్ 2వ తేదీన విజ‌య‌వాడ నుంచి తుని ప‌ట్ట‌ణానికి రైలులో చేరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. అందులో భాగంగా కొన్ని స్టేష‌న్లో వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటాన‌ని చెప్పారు.

సేనానితో రైలు ప్ర‌యాణం..

జ‌న్మ‌భూమి ట్రైన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌యాణిస్తారు. సేనానితో రైలు ప్ర‌యాణం పేరుతో ప‌లు వ‌ర్గాల ప్ర‌తినిధులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మాట్లాడ‌తారు. విజ‌య‌వాడ నుంచి తుని చేరుకునే వ‌ర‌కు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మాటా మంతీ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల‌కు రైల్వే పోర్ట‌ర్ల‌తో మాట్లాడ‌తారు. ఆత‌ర్వాత మామిడి రైతులు అసంఘ‌టిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండ‌ర్ల‌తో పాటు రైలులోని ప్ర‌యాణికులు, చెర‌కు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్ధులు, ఏటికొప్పాక బొమ్మ‌ల త‌యారీ క‌ళాకారుల‌తో ఈ ప్ర‌యాణంలో మాట్లాడ‌తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here