Home Actor న‌వీన్ చంద్ర హీరోగా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం..!

న‌వీన్ చంద్ర హీరోగా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్రారంభం..!

99
0

హీరోగా తనదైన ముద్ర వేసిన నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి వేణు మ‌దుకంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న‌ ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి దర్శకుడు అనీల్ కృష్ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వహించారు.

ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ వేణు మ‌దుకంటి మాట్లాడుతూ… వెంకటాపురంకి దర్శకుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైం తీసుకున్నాం. నిర్మాత మంజునాథ్ గారుతో కలసి సంవత్సరం నుండి ఈ కథ పై వ‌ర్క్ చేసాం. ఇప్పటి వరకూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాని కథ, కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. నిర్మాత మంజునాథ్ గారు మంచి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి రాబోతున్నారనే నమ్మకం మాకుంది.

వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో చివరి నిముషం వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. చివరి వరకూ ఎవరూ ఊహించని మలుపులతో కథ నడుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్స్ లో ఇప్పటి వరకూ చూసిన నవీన్ చంద్రను కొత్త గా ప్రజెంట్ చేయబోతున్నాను నవీన్ చంద్ర ఇప్పటి వరకూ చేయని రోల్ లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారం లో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది.

నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ.. యశాస్ సినిమాస్ బ్యానర్ లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథ పై వర్క్ చేసాం. తప్పకుండా ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… నా కెరియర్ లో బాల్ రెడ్డి పాత్ర పెద్ద మలుపు గా అనుకోవచ్చు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నాను. ఈ సంద‌ర్భంగా  త్రివిక్రమ్ గారికి, ఎన్టీఆర్ గారి చాలా థాంక్స్. ఈ కథ కూడా అన్ని రకాల ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. కథ ను నమ్మే ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఈ బ్యానర్ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు ముందు ఉంటుంది. వంద సినిమాలు ఈ బ్యానర్ నుండి రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here