Home Actor ‘పలాస 1978’’ తో విలన్ గా మారుతున్న రఘు కుంచే

‘పలాస 1978’’ తో విలన్ గా మారుతున్న రఘు కుంచే

90
0
‘పలాస 1978’’ తో విలన్ గా మారుతున్న రఘు కుంచే spiceandhra

యాంకర్ గా,సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచే తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్ తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచే విలన్ గా కనిపించబో తున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ కు బాగా స్కోప్ ఉన్న చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నారు.‘‘పలాస 1978’’ కు రఘు కుంచే మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం.

ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు,రఘు విలన్ పాత్ర కు సూటవుతారని ఫిక్స్ చేశారు.ఈ క్యారెక్టర్ లో నాలుగు డిఫరెంట్ ఏజ్ లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్ లలో అతను కనపించబోతున్నారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘‘పలాస 1978’’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.

రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి పాటలు : సుద్దాల అశోక్ తేజ,లక్ష్మీ భూపాల,భాస్కర భట్ల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచే , పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం : కరుణ కుమార్.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here