Home Actor పార్టీ నిర్మాణంలో వ్యక్తిగ‌త అజెండాల‌కు తావులేదు – నాదెండ్ల మ‌నోహ‌ర్

పార్టీ నిర్మాణంలో వ్యక్తిగ‌త అజెండాల‌కు తావులేదు – నాదెండ్ల మ‌నోహ‌ర్

32
0
పార్టీ నిర్మాణంలో వ్యక్తిగ‌త అజెండాల‌కు తావులేదు - నాదెండ్ల మ‌నోహ‌ర్ spiceandhra

పార్టీ నిర్మాణంలో వ్య‌క్తిగ‌త అజెండాల‌కు తావులేద‌ని, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి క‌మిటీల్లో అవ‌కాశం ఉంటుంద‌ని జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హార‌ల క‌మిటీ చైర్మ‌న్ శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్ప‌ష్టం చేశారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ప్యాక్ స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడారు. స‌మావేశ వివ‌రాలు ఆయ‌న‌ వెల్ల‌డిస్తూ… క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి సంబంధించి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ప్యాక్ స‌భ్యులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి తీసుకువ‌చ్చారు.

క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ పార్టీ బ‌లోపేతానికి చేయాల్సిన కృషి పై చ‌ర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌ల్ని గుర్తించి పార్టీ ప్ర‌జ‌ల‌తోనే ఉంద‌నేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి. నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌ఛార్జ్‌లు, క‌మిటీల నియామ‌కంలో ఎటువంటి ప‌క్ష‌పాతం లేకుండా నిజ‌మైన జ‌న సైనికుల‌కి అవ‌కాశం క‌ల్పిస్తాం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ నిర్మాణం, గెలుపు కోసం ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు  కృషి చేశారు.

భీమ‌వ‌రంలో క్యాన్స‌ర్ వ్యాధికి కీమో థెర‌పీ చేయించుకుంటూ కూడా పార్టీ కోసం, శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారి గెలుపు కోసం అహర్నిశలు  కృషి చేసిన కొప్పినీడి మురళి అనే కార్య‌క‌ర్త ప్రాణాలు కోల్పోయిన విష‌యాన్ని శ్రీ నాగ‌బాబు గారు అధ్య‌క్షుల వారి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇలాంటి వ్య‌క్తుల‌ను అంతా ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఆగ‌స్ట్ మొద‌టి వారంలో భీమ‌వ‌రంలో ప‌ర్య‌టన సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ముర‌ళీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. జ‌న‌సేన పార్టీ అత‌ని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అసెంబ్లీలో పార్టీ త‌ర‌ఫున‌, ప్ర‌జ‌ల త‌రుఫున బ‌లంగా గ‌ళం వినిపించిన శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్ రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించాలి అని ఆకాంక్షించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here