Home Actor పూరితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య్.!

పూరితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య్.!

23
0
పూరితో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన విజ‌య్.! spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్… ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో.. పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. ఇస్మార్ట్ స‌క్స‌స్ సాధించ‌డంతో… ఈ సినిమాని పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయాల‌నుకున్నార‌ని.. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. పూరి నెక్ట్స్ మూవీ మాత్రం విజ‌య్ తోనే అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

వీరిద్ద‌రూ క‌లిస్తే.. ఇక ఆ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే..విజ‌య్ లేటెస్ట్ మూవీ డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన విజ‌య్ ని పూరితో సినిమా అని వార్త‌లు వ‌స్తున్నాయి నిజ‌మేనా..?  అని అడిగితే… అస‌లు ఆ ఆలోచ‌నే లేదు అని చెప్పాడు.

విజ‌య్ చెప్పిన స‌మాధానం బ‌ట్టి పూరితో సినిమా లేద‌ని తెలిసింది. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా అని కూడా టాక్ వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు అని అడిగితే… కొర‌టాల శివ గారితో వ‌ర్క్ చేయాల‌ని వుంది. ప్ర‌స్తుతం ఆయ‌న చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన త‌ర్వాత ఇద్ద‌రికీ సెట్ అవుతాదేమో చూడాలి అని చెప్పాడు. దీనిని బ‌ట్టి ఖ‌చ్చితంగా కొర‌టాల‌తో విజ‌య్ సినిమా ఉంటుందనిపిస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here