Home Actor పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ లో క‌న్న‌డ స్టార్ హీరో..?

పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ లో క‌న్న‌డ స్టార్ హీరో..?

22
0
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ లో క‌న్న‌డ స్టార్ హీరో..? spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో ఇస్మార్ట్ శంక‌ర్ దూసుకెళుతున్నాడు. అయితే… పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌నుకున్నారు. క‌థ విని మ‌హేష్ ఓకే చెప్పారు. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. మ‌హేష్ నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో పూరి ఈ సినిమాని వెంక‌టేష్ చేయాల‌నుకున్నారు.

వెంకీకి క‌థ చెప్ప‌డం.. క‌థ విని వెంకీ కూడా ఇంట్ర‌స్ట్ చూపించిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇటీవ‌ల పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిసారని.. విజ‌య్ తో జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… విజ‌య్ తో అస‌లు ఈ ప్రాజెక్ట్ అనుకోలేద‌ట‌. క‌న్న‌డ స్టార్ హీరో యాష్ తో ఈ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఆల్రెడీ యాష్, పూరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. స్టోరీ లైన్ విని యాష్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట‌. అయితే… ఫుల్ స్టోరీ విన్న త‌ర్వాత చేయాలా..? వ‌ద్దా..?  అనేది చెబుతా అన్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం పూరి ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ టూర్ లో ఉన్నారు.  ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్స‌స్ టూర్ కంప్లీట్ అయిన త‌ర్వాత పూరి యాష్ కి జ‌న‌గ‌ణ‌మ‌న‌ ఫుల్ స్టోరీ చెబుతార‌ట‌. క‌థ విని పూరికి యాష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here