Home Actor పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

41
0
పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..? spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. రామ్, నిథి అగ‌ర్వ‌ల్, న‌భా న‌టేష్ హీరో, హీరోయిన్స్ గా రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా పూరి మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

రామ్ తో సినిమా చేయాలి అని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను కానీ..కుద‌ర‌లేదు. ఇన్నాళ్ల‌కు కుదిరింది. ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ బాయ్ క్యారెక్ట‌ర్స్ చేసి బోర్ కొట్టేసింది. బ్యాడ్ బాయ్ క్యారెక్ట‌ర్ కావాలి అని రామ్ చెప్పాడు. అప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ స్టోరీ రెడీ చేసానని పూరి చెప్పారు. ఇంతవరకూ రామ్ ను ఎవరూ చూపించనంత డిఫరెంట్ గా నేను ఈ సినిమాలో చూపించాను.

 ఆయనలోని ఎనర్జీని నేను పూర్తిస్థాయిలో వాడుకున్నాను. రామ్ అభిమానులు ఈ సినిమాలో కొత్త రామ్ ను చూస్తారు అని  చెప్పారు. త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అని అడిగితే… పైసా వ‌సూల్ త‌ర్వాత బాల‌య్య‌, నేను మ‌రో సినిమా చేయాలి అనుకున్నాం. ఒక కొత్త క‌థ రెడీ చేసి బాల‌య్య‌ను క‌లుస్తాను. ఈసారి ఖ‌చ్చితంగా బాల‌య్య‌తో పెద్ద హిట్ అయ్యే సినిమా తీస్తాను అని చెప్పారు. నెక్ట్స్ ఎవ‌రితో సినిమా చేస్తాను అనేది ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ త‌ర్వాత చెబుతాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here