Home Movie News పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

126
0

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్…త‌న‌యుడు ఆకాష్ తో మెహ‌బూబా సినిమా తెర‌కెక్కించ‌డం…ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత పూరి త‌దుప‌రి చిత్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. ఆకాష్ తోనే పూరి నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ…ఆకాష్ తో తీయాల‌నుకున్న నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరి త‌న శిష్యుడు అనిల్ కి ఇచ్చార‌ని తెలిసింది. అయితే…పూరి నెక్ట్స్ మూవీ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కి పూరి క‌థ చెప్పార‌ట‌. క‌థ విని రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పూరి ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నార‌ని..ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమాని ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే…పూరి – రామ్ కాంబినేష‌న్ లో రూపొందే ఈ సినిమాని ఎవ‌రు నిర్మించ‌నున్నారు అనేది ఇంకా తెలియాల్సివుంది. ఇదిలా ఉంటే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా పూరితో ఓ సినిమా ఉంటుంది అని అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూ తెలియ‌చేసారు. సో..రామ్ సినిమా త‌ర్వాత ర‌వితేజ‌తో పూరి సినిమా ఉంటుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here