Home Movie News పూరి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

పూరి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

90
0
puri jagannadh latest movie

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మెహ‌బూబా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఆకాష్ తోనే సినిమా చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఎనౌన్స్ మెంట్ ఉంటుంది అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇంత‌లో పూరి… త‌న‌యుడు ఆకాష్ తో సినిమా చేయ‌డం లేదు. వేరే హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల నాగార్జున – నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో పూరి మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ కోస‌మే మ‌న్మ‌ధుడు 2 అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ని టాక్ వినిపించింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…పూరి రాసిన క‌థ‌తో ఆకాష్ సినిమా ఉంటుంద‌ట కానీ..డైరెక్ట‌ర్ పూరి కాదు. కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు అని తెలిసింది. నాగ్ – చైతు ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. అందుచేత వీరిద్ద‌రితో పూరి చేయాల‌నుకున్న సినిమా ఇప్ప‌ట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. అయితే.. పూరి ఎప్ప‌టి నుంచో హాలీవుడ్ మూవీ చేయాల‌నుకుంటున్నారు. ఇప్పుడు ఆ వైపుగా ఆలోచిస్తున్నార‌ట‌. కేవ‌లం ఆలోచించ‌డ‌మే కాదండోయ్..హాలీవుడ్ మూవీస్ చేసేందుకు స్ర్కిప్ట్ లు కూడా రెడీ చేసేసాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే..పూరి డైరెక్ష‌న్ లో హాలీవుడ్ మూవీ రావ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here