Home Actor పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..?

16
0
పూరి నెక్ట్స్ మూవీ ఫిక్స్. ఇంత‌కీ హీరో ఎవ‌రు..? spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ లేటెస్ట్ సెన్సేష‌న్ ఇస్మార్ట్ శంక‌ర్. రామ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో నేటికీ స‌క్స‌స్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే… పూరి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న క‌న్న‌డ స్టార్ హీరో యాష్ తో చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో పూరి నెక్ట్స్ మూవీని యాష్ తోనే చేస్తార‌ని అనుకున్నారు కానీ… పూరి త‌దుప‌రి చిత్రాన్ని సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌నున్నార‌ని తెలిసింది. డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ఆక‌ట్టుకోలేక‌పోయిన విజ‌య్ ఈసారి మాంచి క్రేజీ ప్రాజెక్ట్ చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. పూరిని క‌ల‌వ‌డం.. ప్రాజెక్ట్ ఓకే అవ్వ‌డం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే… ఈ మూవీని పూరి బ్యాన‌ర్ లోనే చేస్తారా..?  లేక వేరే బ్యాన‌ర్ తో క‌లిసి చేస్తారా..? ఎప్ప‌టి నుంచి స్టార్ట్ చేస్తారు..? ఏ త‌ర‌హా సినిమా..? అనేవి తెలియాల్సివుంది. అతి త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఈ మూవీని ఎనౌన్స్ చేయ‌నున్నారని స‌మాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here