Home Actor పూరి – విజ‌య్ మూవీ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

పూరి – విజ‌య్ మూవీ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

11
0

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. లేటెస్ట్ సెన్సేష‌న్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత పూరి ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడో అనేది ఆస‌క్తిగా మారింది. కొత్త మంది హీరోల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఫైన‌ల్ గా సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

పూరి దర్శకత్వం వహించే ఈ సినిమాకి ఆయనతో పాటు ఛార్మి నిర్మాతగా వ్యవహరించనున్నారు. పూరి భార్య లావణ్య ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశారు. అంతే కాకుండా… పూరి .. ఛార్మి .. విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

ప్ర‌స్తుతం పూరి స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. విజ‌య్ క్రాంతి మాధ‌వ్ తో చేయ‌నున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. జ‌న‌వ‌రి నుంచి పూరి, విజ‌య్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది అని స‌మాచారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here