Home Movie News పెళ్లి చేసుకోబోతున్న యువ క‌మెడియ‌న్..!

పెళ్లి చేసుకోబోతున్న యువ క‌మెడియ‌న్..!

106
0

పెళ్లి చేసుకోబోతున్న యువ క‌మెడియ‌న్ ఎవ‌ర‌నుకుంటున్నారా..?  రాహుల్ రామ‌కృష్ణ‌. అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపుల‌ర్ అయిన రాహుల్ రామ‌కృష్ణ ఇటీవ‌ల‌ గీత గోవిందం సినిమాతో మ‌రోసారి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ…కెరీర్ లో బాగా బిజీగా ఉన్న రాహుల్ రామ‌కృష్ణ త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోబోతున్నాడ‌ట‌. అవును..ఈ విష‌యాన్ని స్వ‌యంగా అత‌నే సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసాడు.

బీచ్ లో త‌న‌కు కాబోయే భార్య‌తో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి..జ‌న‌వ‌రి 15న పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవ‌రికీ చెప్ప‌కండి అంటూ త‌న‌దైన శైలిలో తెలియ‌చేసాడు. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్‌, కమెడియన్ వెన్నెల కిశోర్‌, విద్యుల్లేఖ రామన్ త‌దిత‌రులు  రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here