Home Uncategorized ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది – జ‌న‌సేన నాయ‌కుడు రావెల కిషోర్ బాబు.

ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది – జ‌న‌సేన నాయ‌కుడు రావెల కిషోర్ బాబు.

157
0

జనసేన నాయ‌కుడు రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ..సిఎం‌ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ చేశామని, అభివృద్ది జరిగింది అంటూ అభూత కల్పనలను వివరిస్తున్నారు. ఈ శ్వేత పత్రాలలో చేయని పనులు చేసినట్లుగా, చేసిన తప్పులను ఒప్పులుగా చూపించుకుంటున్నారు అని విమ‌ర్శించారు.మెడికల్ కు సంబంధించి ,ఎం.ఎం.ఆర్, ఐఎమ్ఆర్ ల రేట్ల  విషయంలో  అన్నీ  అబద్దాలే చెప్పారు అన్నారు. వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కేవలం ధనికులు, పట్టణ ప్రాంతం వాసులకే పరిమితం అయ్యాయి

గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఏ మాత్రం వైద్య సదుపాయాలు అందడం లేదు. శ్వేత పత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు. ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది, వైద్యుల కొరత ఉన్నా.. ఇంతవరకు భర్తీ చేయలేదు. ఎన్నో కొత్త పధకాలు పెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మెడికల్ డైరెక్టర్ పోస్ట్ లో ఇంతవరకు నియమించ లేదు. గతంలో చేసిన వారంతా ఒత్తిడి ని తట్టులోలేక వదిలేశారు.

పూనం మాలకొండయ్య వేధింపులు భరించలేక ఆ పోస్ట్ లోకి ఎవరూ రావడం లేదు అని రావెల కిషోర్ బాబు చెప్పారు. మెక్ టెక్ జోన్ లో పది మెడికల్ సంస్థ లు వచ్చినట్లు ప్రకటించినా… అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మెక్ టెక్ జోన్ పై ప్రత్యేక శ్వేత పత్రం విడుదల చేయాలి. వైద్య పరికరాల కొనుగోళ్లలో కూడా లక్షల రూపాయల అవినీతి జరిగింది. మూడు వేల రూపాయలు ఖరీదు చేసే పరికరానికి ముప్పై వేలు బిల్లు పెట్టడం దుర్మార్గం. వాటిని సరఫరా చేసే సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here