Home Actor ప్రజలని విడగొట్టే హామీలు ఇవ్వడం నచ్చదు – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ప్రజలని విడగొట్టే హామీలు ఇవ్వడం నచ్చదు – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

116
0

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు రైతుల‌కు, డ్వాక్రా మహిళ‌ల‌కు డ‌బ్బులు ఇస్తున్నాం అని గొప్ప‌లు చెబుతున్నారు.  వాళ్ల‌కు ఇస్తున్న డ‌బ్బు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఇస్తున్నారు త‌ప్ప సొంత జేబుల నుంచి కాదు. ఆ డ‌బ్బుల‌తోనే ఓట్లు కొంటున్నారు. అస‌లు భార‌త‌దేశంలో ఇచ్చేవాడు ఎవ‌డు..? తీసుకునేవాడు ఎవ‌డు..? ఇదంతా మ‌న హ‌క్కు. ఇక్క‌డ ఇచ్చే వాడు కాదు కావాల్సింది. స‌మానంగా పంచ‌గ‌లిగేవాడు కావాలి అని జ‌న‌సేన అధ్య‌క్షుడు తెలియ‌చేసారు.  నేను స‌మానంగా పంచ‌గ‌ల‌ను. అందుకే కులాలు,మ‌తాలుగా విడ‌దీసి హామీలు ఇవ్వ‌డం న‌చ్చ‌దు.  ముస్లింలు  భార‌త‌దేశంలో అంత‌ర్భాగం. ఇక్క‌డ పుట్టిన ముస్లింలు… నేను భార‌తీయుడ‌నే అని ప్ర‌త్యేకంగా దేశ‌భ‌క్తి చూపించాలా..? పాకిస్థాన్ లో యుద్ధం జ‌రిగితే వీళ్ల‌కేంటి సంబంధం. హిందూవుల‌కేనా దేశ‌భ‌క్తి ఉండేది..?  దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలు, మాన‌వ‌త్వం చాటుకున్న ముస్లింలు మ‌న‌దేశంలో లేరా..?  థియేట‌ర్ల‌లో జాతీయ‌గీతం అల‌పించ‌డ‌మేనా దేశ‌భ‌క్తి..? నిజంగా దేశ‌భ‌క్తి ఉన్న‌వాళ్లు మతం పేరుతో మ‌నుషుల్ని చంప‌రు. పాకిస్థాన్ ఉగ్ర‌చ‌ర్య‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు చేయ‌టానికి, మ‌త‌క‌ల్లోలం సృషించ‌డానికి కొంత‌మంది చూస్తున్నారు. వారికి జ‌న సైనికులు గ‌ట్టిగా బుద్ది చెప్పాలి. కులాల‌ను, మ‌తాల‌ను వేరు చేసే రాజ‌కీయానికి జ‌న‌సేన ఎప్పుడు వ్య‌తిరేక‌మే.కులాల గోడలను బద్దలు కొట్టేందుకే రాజకీయాల్లోకి వచ్చా. నేను ప్రజల మనిషిని. పార్టీల మనిషిని కాదు. జనసేన ఉనికిని చంపుకొనే పని ఎప్పుడూ చేయను. వామపక్షాలతోనే జనసేన కలిసి నడుస్తుంది అని తెలియ‌చేసారు.

 * కొత్త రక్తాన్ని రాజకీయాల్లో నింపుతా

ఆ ఎంపీ మ‌న పార్టీలోకి రావాలి, ఈ ఎంపీ మ‌న పార్టీలోకి రావాలి అని నేను కోరుకోవ‌డం లేదు. కొత్త ర‌క్తాన్ని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని మాత్ర‌మే అనుకుంటున్నాను. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక్క ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి త‌రిమికొట్టాడు. అలాగే అవినీతితో నిండిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని సామాన్య యువ‌త సాయంతో ప్ర‌క్షాళ‌న‌ గావిస్తా. మార్పు రావాలంటే 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రు ఓటు వేయండి. జ‌న‌సేన పార్టీలో పెద్ద పెద్ద నాయ‌కులు లేరు. వేల కోట్ల డ‌బ్బులు లేవు. ఉన్న‌ది ఒక్క‌టే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మార్పు తేవాల‌న్న బ‌ల‌మైన సంక‌ల్పం. సామాన్య యువ‌త‌తోనే ఆ మార్పు తీసుకువ‌చ్చి తీరుతా. ప్ర‌తి చోటా కొత్త వ్య‌క్తుల్నే అభ్య‌ర్ధులుగా నిల‌బెడ‌తా. ఎంత మంది గెలుస్తారో తెలియ‌దు. జ‌న‌సేన పార్టీని ముందుకి తీసుకువెళ్ల‌డానికి నా వంతు శాయ‌శ‌క్తుల కృషి చేస్తా. సినిమాల్లో సూప‌ర్‌స్టార్‌ని అయినా, రాజ‌కీయాల్లో అట్ట‌డుగు స్థాయి నుంచి పైకి వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నాను. 25 ఏళ్ల ప్ర‌యాణానికి సిద్ధ‌మై రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. నా ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బు లేదు, న్యూస్ ఛాన‌ల్స్‌, పేప‌ర్లు లేవు. జ‌న‌సైనికులే నా ఛాన‌ల్స్‌. ఎలాంటి మీడియా సాయం లేకుండా జాతీయ రాజ‌కీయాలు శాసించే స్థాయి పార్టీని స్థాపించిన కాన్షీరాం గారే నాకు ఆద‌ర్శం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here