Home Actor ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే – డా.మంచు మోహ‌న్‌బాబు

ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే – డా.మంచు మోహ‌న్‌బాబు

206
0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల కౌంటింగ్ ఈరోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం… ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా, 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటివరకూ కౌంట్ చేసిన ఓట్లలో వైసీపీకి 50.9 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 38.2 శాతం ఓట్లు, జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయి.

ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి డా.మోహ‌న్ బాబు స్పందిస్తూ…ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. ఖ‌చ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అని తెలియ‌చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here