Home Actor ప్రజా స‌మ‌స్యల‌పై అధ్యయ‌నానికి యువ అభ్యర్ధుల‌తో క‌మిటీలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప్రజా స‌మ‌స్యల‌పై అధ్యయ‌నానికి యువ అభ్యర్ధుల‌తో క‌మిటీలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

57
0
ప్రజా స‌మ‌స్యల‌పై అధ్యయ‌నానికి యువ అభ్యర్ధుల‌తో క‌మిటీలు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ spiceandhra

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నానికి యువ అభ్య‌ర్ధుల‌తో పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో క‌మిటీలు రూపొందించ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి స‌మ‌స్య మీద ఓ క‌మిటీ వేస్తామ‌ని, ఆయా స‌మ‌స్య‌ల మీద అవ‌గాహ‌న ఉన్న వారికే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని తెలిపారు. ఎవ‌రికి కేటాయించిన స‌మ‌స్య‌ల‌పై వారు అధ్య‌య‌నం చేసి పార్టీకి నివేదిక స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. బుధ‌వారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ప్ర‌తి అభ్య‌ర్ధికి ఏ ఏ అంశాల మీద అవ‌గాహ‌న ఉంది అనే అంశాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం యువ అభ్యర్ధులను ఉద్దేశించి శ్రీ న్ళ్యాణ్ మాట్లాడుతూ ఒక్కో క‌మిటీలో మూడు నుంచి ఐదుగురు స‌భ్యులు ఉంటారు. క‌మిటీల ఏర్పాటు బాధ్య‌త ప్యాక్ చూసుకుంటుంది. ఆగ‌స్ట్ 7వ తేదీ నాటికి ఈ క‌మిటీల నియామ‌క ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. వ్య‌వ‌సాయం, స‌హ‌కారం రంగం లాంటి అంశాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా, ఆయా స‌మ‌స్య‌ల‌కు సంబంధించి పోరాటానికి నేను వెళ్లాల్సి వ‌చ్చిన సంద‌ర్భాల్లో స‌ద‌రు క‌మిటీలు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్య‌య‌నం జ‌ర‌పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంలోనూ క‌మిటీలు ముందుగా నివేదిక‌లు రూపొందించాలి. క‌మిటీల‌లో ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారితో పాటు పోటీ చేయ‌ని వారు కూడా ఉంటారు. మీ ప‌ని తీరు ఆధారంగా ఈ సారి అవ‌కాశాలు ఉంటాయి అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here