Home Actor ప్రభాస్ “షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్ 2” రిలీజ్ కి ముహుర్తం ఖ‌రారు.

ప్రభాస్ “షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్ 2” రిలీజ్ కి ముహుర్తం ఖ‌రారు.

185
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం పై  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే…ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోన్న శ్ర‌ద్ధ క‌ఫూర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రేపు ఉద‌యం 8.20 నిమిషాల‌కు టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన ప్ర‌భాస్ సాహోతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here