Home Actor ప్రియ‌త‌మా ప్రియ‌త‌మా…మ‌జిలీ పాట అదిరింది..!

ప్రియ‌త‌మా ప్రియ‌త‌మా…మ‌జిలీ పాట అదిరింది..!

197
0


అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ & ఫ‌స్ట్ సాంగ్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఈ రోజు ప్రియ‌త‌మా ప్రియ‌త‌మా..అంటూ సాంగ్ పాట‌ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. చిన్మయి పాడిన ఈ పాట‌కు గోపీ సుంద‌ర్ విన‌సొంపైన బాణీలు అందించారు.

విన్న వెంట‌నే…మ‌ళ్లీ మ‌ళ్లీ వినాలి అనిపించేలా..హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంది ఈ పాట. చైత‌న్య ప్ర‌సాద్ ఈ పాట‌ను రాసారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్ 5న మ‌జిలీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి…అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌జిలీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here