Home Actor ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 సెంటిమెంట్ ని ఫాలో అవుతదా..? బ్రేక్ చేస్త‌దా..?

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 సెంటిమెంట్ ని ఫాలో అవుతదా..? బ్రేక్ చేస్త‌దా..?

96
0

 సుధీర్ బాబు, నందిత రాజ్ జంటగా నటించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్. ద‌ర్శ‌కుడి మారుతి క‌థ‌తో ప్ర‌భాక‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్ 2 రూపొందుతోంది. ఇందులో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ‌రికిష‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ నెల 21న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లో .. హారర్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి..అనే హీరో డైలాగ్ .. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా… అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.  ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే..గాయం 2, అవును 2, స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్, రాజు గారి గ‌ది 2…ఇలా తెలుగులో రూపొందిన సీక్వెల్ మూవీస్ స‌క్స‌స్ అవ్వ‌లేదు. మ‌రి..ప్రేమకథా చిత్రమ్ 2 సెంటిమెంట్ ని ఫాలో అవుతదా..?  బ్రేక్ చేస్తదా..? అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here