Home Actor ప్రేమ వెన్నెలా .. రావే ఊర్మిళా..అంటోన్న సాయితేజ్..!

ప్రేమ వెన్నెలా .. రావే ఊర్మిళా..అంటోన్న సాయితేజ్..!

134
0


మెగాస్టార్ మేన‌ల్లుడు సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్,  నివేదా పేతురాజ్  హీరో, హీరోయిన్లుగా న‌టించిన‌ చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈ చిత్రానికి నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అందమైన ప్రేమకథగా నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడవ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా .. ఏడురంగులొక్కటై పరవశించే వేళలో నేలకే జారిన కొత్త రంగులా .. ప్రేమ వెన్నెలా .. రావే ఊర్మిళా .. అంటూ ఈ పాట సాగుతోంది.

ప్రకృతి తనకి ప్రసాదించిన కొత్త అందమే ఈ ప్రియురాలు అనే భావానికి అక్షర రూపమిచ్చి కథానాయకుడు పాడుకునే పాట ఇది. సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ పై చిత్రీకరించిన ఈ పాట విన్న వెంట‌నే న‌చ్చేట్టుగా ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గీత ర‌చ‌యిత‌ శ్రీమణి సాహిత్యం  సుదర్శన్ అశోక్ ఆలాపన క‌రెక్ట్ గా సెట్ అవ్వ‌డంతో విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సాయితేజ్..స‌రైన స‌క్స‌స్ కోసం వెయిట్ చేస్తున్న త‌రుణంలో వ‌స్తున్న సినిమా ఇది. చిత్ర‌ల‌హ‌రి మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి…అంచ‌నాల‌ను అందుకుని ఆశించిన విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here