Home Actor ప్ర‌చారంలో కొత్త‌ద‌నం.. మ‌రి..వ‌స్తుందా విజ‌యం..?

ప్ర‌చారంలో కొత్త‌ద‌నం.. మ‌రి..వ‌స్తుందా విజ‌యం..?

51
0
ప్ర‌చారంలో కొత్త‌ద‌నం..మ‌రి..వ‌స్తుందా విజ‌యం..? spiceandhra

థియేర‌ట్ కి ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించ‌డం కోసం విప‌రీతంగా ప‌బ్లిసిటీ చేసి.. త‌మ సినిమాకి క్రేజ్ ఏర్ప‌రుచుకోవాలని  త‌పిస్తుంటారు. అందుకోసం కొత్త‌గా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇప్పుడు సందీప్ కిష‌న్ న‌టించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే చిత్ర యూనిట్ కూడా అలాగే ఆలోచించింది. ఇంత‌కీ ఈ టీమ్ ఏం చేసిందంటే… ప్రశాంతంగా పాస్ పోసుకుందాం అని టాయిలెట్‌కి వెళ్లిన వాళ్లకు ‘కిందే చూడు.. వెనక్కి తిరిగి చూడొద్దు.. ఎవరో ఉన్నారు జాగ్రత్త..! నిను వీడని నీడను నీనే.. జూలై 12న వచ్చేస్తున్నా’ అంటూ మూవీ పోస్టర్లను పెట్టి టాయిలెట్‌కి వెళ్లే వాళ్లను భయపెడుతున్నాడు.

వినూత్నంగా ప్రమోషన్ చేస్తే తప్ప ఫలితం ఉండదని భావించిన ఈ సినిమా టీం.. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఈ డిఫ‌రెంట్ ప‌బ్లిసిటీ హాట్ టాపిక్ అయ్యింది. హారర్ థ్రిల్లర్‌ జోనర్ లో వస్తున్న ఈ సినిమా.. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్స్‌లోని టాయిలెట్స్‌లో ‘నిను వీడని నీడను నేనే’ బోర్డ్‌లను ఏర్పాటు చేసింది. టాయిలెట్స్ కోసం వెళ్లిన వాళ్ళు ఈ బోర్డ్‌లు చూసి అవాక్కవుతున్నారు.

ఫాస్ట్‌గా జిప్ మూసెయ్.. నిను వీడని నీడను నీనే’, ‘అద్ధంలో చూసుకున్నప్పుడు జాగ్రత్త.. దెయ్యాలు ఉంటాయి’ లాంటి కొటేషన్స్ కనిపిస్తున్నాయ్. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌లు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నాయి. మ‌రి.. ఈ వాష్ రూమ్ ప‌బ్లిసిటీ ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here