Home Actor ప్ర‌చారంలో దూసుకెళుతోన్న‌ జ‌న‌సేన పార్టీ రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌..!

ప్ర‌చారంలో దూసుకెళుతోన్న‌ జ‌న‌సేన పార్టీ రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ అభ్య‌ర్ధి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌..!

100
0


జ‌న‌సేన పార్టీ త‌రుపున రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అత్తి స‌త్య‌నారాయ‌ణ పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌కు తూర్పు గోదావ‌రి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్ మ‌ద్ద‌తు తెలియ‌చేసింది. అంతే కాకుండా..జిల్లా వ్యాప్తంగా ఉన్న అసోసియేష‌న్ జ‌న‌సేన పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి విజ‌యానికి కృషి చేస్తామ‌న్నారు. రాజ‌మండ్రిలోని ప్ర‌తి వార్డ్ కి వెళ్లి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను తెలుసుకుంటూ… మెరుగైన పాల‌న కావాలంటే జ‌న‌సేన పార్టీకి ఓటు వేయాల‌ని తెలియ‌చేస్తూ ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు.

ఈ సంద‌ర్భంగా అత్తి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ… ఈ ఎన్నిక‌లు నీతికి, అవినీతికి..స్వార్ధానికి, నిస్వార్ధానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లు. ఎందువ‌ల‌న అంటే… అధికార పార్టీ చంద్ర‌బాబు నాయుడు గారు, వారి అబ్బాయిని సీఎం చేద్దామ‌ని స్వార్ధంతో ఈ ఎన్నిక‌లకు రాబోతున్నారు. అలాగే జ‌గ‌న్ గారు కేసుల‌ను మాఫీ చేసుకోవ‌డానికి సీఎం పీఠంలో కూర్చుందామ‌నుకుంటున్నారు కానీ..మన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అలా కాదు. ఎన్నో కోట్ల సంపాద‌న వ‌దులుకుని మ‌న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న‌తో ఎన్నిక‌ల‌కు రాబోతున్నారు.

కాబ‌ట్టి మ‌హిళ‌లు, యువ‌కులు..అంద‌రూ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని బ‌ల‌ప‌ర‌చి మ‌న జ‌న‌సేన జెండాను అమ‌రావ‌తిలో ఎగ‌ర‌వేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని సీఎంని చేస్తార‌ని ఆశిస్తున్నాను. జ‌న‌సేన పార్టీ త‌రుపున రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న ఆకుల స‌త్య‌నారాయ‌ణ గారు అంద‌రికీ తెలుసు. పిలిస్తే ప‌లికే వ్య‌క్తి. అంద‌రికీ అందుబాటులో వ్య‌క్తి. ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ…అంద‌రికీ అందుబాటులో ఉంటాను. ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి. రాజ‌మండ్రిని మ‌రింత‌గా అభివృద్ధి చేస్తాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here