Home News ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపే ఉన్నారు.. ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తాం – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల...

ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపే ఉన్నారు.. ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తాం – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్

81
0


తెనాలిలో జ‌న‌సేన గెలుపు ఖాయ‌మ‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలియ‌చేసారు. రాష్ట్ర అభివృద్ధికి జ‌న‌సేన క‌ట్టుబ‌డి ఉంద‌ని… ప‌వ‌న్ కు ఒక అవ‌కాశం ఇస్తే..పాల‌న‌లో మార్పు చూస్తార‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ…ప్ర‌జ‌లు చాలా అభిమానంతో ఆద‌రిస్తున్నారు. మంచి కార్య‌క్ర‌మాలు చేయాలని ముందుకు వ‌చ్చాం. గ‌తంలో శాస‌న‌స‌భ్యుడిగా చేసిన కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకున్నారు.

ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం కార‌ణంగా తెనాలి నుంచే పోటీ చేస్తున్నాను. నిరంత‌రం ప్ర‌జాసేవ చేయాల‌నుకుంటున్నాను. అభివృద్ధి, సంక్షేమం అనేది ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఉన్నా ఆలోచించాలి. మేము యువ‌త పైనా, మ‌హిళ‌ల పైనా దృష్టి పెట్టాం. కొత్త పాల‌సీలు, కొన్ని కొత్త ఆలోచ‌న‌లతో ముందుకు వ‌స్తున్నాం. ప్ర‌తి కుటుంబానికి రూపాయి కూడా క‌ట్ట‌కుండా 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ అందించేట‌ట్టు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ప్ర‌భుత్వంలో ఉన్నా లేక‌పోయినా పార్టీ త‌రుపున చేయాల‌ని జ‌న సైనికులు అంద‌రికీ ఈ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం.

ఈ విధంగా ధ‌ర్మాన్ని, న్యాయాన్ని పాటించాల‌ని ఈ కార్య‌క్ర‌మాలు అన్నీ చేస్తున్నాం. ప్ర‌జ‌లు ఆద‌రిస్తారు. మ‌మ్మ‌ల్ని గెలిపిస్తారు అనే న‌మ్మ‌కం స్ప‌ష్టంగా ఉంది. రాజ‌కీయాల్లో నిజాయితీగా బ‌త‌కాల‌ని ముందుకు వ‌చ్చాం. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ద‌వి కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు కానీ…ప్ర‌జా సంక్షేమం కోసం ప్ర‌జ‌ల కోసం మాత్రం ఏం చేయ‌డం లేదు. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ ధీమా వ్య‌క్తం చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here