Home Actor ప్ర‌భాస్ తో పోటీప‌డుతున్న హీరో. ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

ప్ర‌భాస్ తో పోటీప‌డుతున్న హీరో. ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

38
0
ప్ర‌భాస్ తో పోటీప‌డుతున్న హీరో. ఇంత‌కీ ఎవ‌రా హీరో..? spiceandhra

బాహుబ‌లి… తెలుగు సినిమా స‌త్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం. ఈ సినిమా దేశ‌, విదేశాల్లో రికార్డులు క్రియేట్ చేయ‌డంతో ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో ప్ర‌భాస్ చేస్తున్న తాజా చిత్రం సాహో పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాకి సుజిత్ ద‌ర్శ‌కుడు. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ & సాంగ్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా కోసం  ప్ర‌భాస్  అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. సాహో చిత్రాన్ని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భారీ అంచనాల‌తో భారీ స్దాయిలో  ప్ర‌భాస్ సినిమా వ‌స్తుండ‌డంతో ఆ డేట్ లో  మిగిలిన హీరోలు సినిమాలు రిలీజ్ చేయ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు సాహో సోలోగా రిలీజ్ అనుకున్నారు. కానీ.. ఓ హీరో మాత్రం ప్ర‌భాస్ తో పోటీకి సై అంటున్నాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రంటారా..?  బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్. అవును…సాహో రిలీజ్ రోజునే అక్ష‌య్ కుమార్ త‌న చిత్రం మిష‌న్ మంగ‌ళ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. దీంతో ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్ మ‌ధ్య పోటీ ఏర్ప‌డింది. అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను బాలీవుడ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద వార్ ఎలా ఉంటుందో అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. ఈ బాక్సాఫీస్ వార్ లో ప్ర‌భాస్ విన్న‌ర్ గా నిలుస్తాడో..?  అక్ష‌య్ కుమార్ విన్న‌ర్ గా నిలుస్తాడో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here