Home Actor ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

71
0
ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..? spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ సెన్సేష‌న్ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సాహో పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఆగ‌ష్టు 15న సాహో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. దీనికి జాన్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే… బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగింది.

దీంతో ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ మాత్ర‌మే కాకుండా బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్  కూడా ప్ర‌భాస్ తో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అయితే…అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ప్ర‌భాస్ సినిమా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ యంగ్ రెబ‌ల్ స్టార్  కోసం ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ రెడీ చేయించార‌ట‌. ప్ర‌భాస్ క‌థ విని సినిమా చేసేందుకు ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి..ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజ‌మా…?  కాదా..?  అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here