Home Telugu ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

170
0
Prabhas-next movie launch date

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ  నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం కోసం ఇటీవ‌ల కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్ ను దుబాయ్ లో చిత్రీక‌రించారు. దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్ లో ప్రారంభించ‌నున్నార‌ని  స‌మాచారం. ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే…ఈ చిత్రానికి క‌థ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ అందించలేద‌ట‌. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి అందించార‌ట‌. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని కూడా యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌గా… కృష్ణంరాజు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here