Home Movie News ప్ర‌భాస్ మూవీకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్..!

ప్ర‌భాస్ మూవీకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్..!

100
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే…ఈ మూవీ షూటింగ్ లో ఉండ‌గానే ప్ర‌భాస్ మ‌రో సినిమాను ప్రారంభించారు. ఈ మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది.

ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఇటీవలే ప్రభాస్‌ కూడా ఇటలీలోని చిత్రబృందంతో జాయిన్‌ అయ్యారు. దీనికి ఇంట్ర‌స్టింగ్ టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటే…అమూర్. ఇదేం టైటిల్ అనుకుంటున్నారా..?  అమూర్ అంటే ఫ్రెంచ్ భాష‌లో ప్రేమ అని అర్ధం. అందుకే ఈ టైటిల్ ఖ‌రారు చేసార‌ని తెలిసింది. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్, గోపీ కృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివ‌రిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here