Home Telugu ప్ర‌భాస్ మూవీకి స్టోరీ ఆ డైరెక్ట‌ర్ ఇచ్చారా..?

ప్ర‌భాస్ మూవీకి స్టోరీ ఆ డైరెక్ట‌ర్ ఇచ్చారా..?

145
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం కోసం ఇటీవ‌ల అబుదాబిలో భారీ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ‌తో ఓ భారీ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే…యూర‌ప్ బ్యాక్ డ్రాప్ లో 1970 కాలంలో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని.

ఇందులో అస్ట్రాల‌జీ తెలిసిన వ్య‌క్తిగా ప్ర‌భాస్ క‌నిపిస్తాడ‌ని తెలిసింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ సినిమా క‌థ‌ను డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి రాసుకున్నార‌ట‌. ఈ క‌థ‌తో సినిమా చేయాల‌ని ట్రై చేసార‌ట కానీ…వ‌ర్కువుట్ కాలేద‌ట‌. ఇది తెలిసి డైరెక్ట‌ర్ రాధాకృష్ణ ఆ క‌థ ప్ర‌భాస్ కి బాగుంటుదని త‌న‌కు ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డం..దీనికి చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి క‌థ‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి.

దీంతో ఈసారి ఎలాంటి క‌థ‌ను రాసారో..?  అనే ఆస‌క్తి పెరిగింది. 1970 కాలంలో జ‌రిగే ప్రేమ‌క‌థ కావ‌డంతో ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ ప్ర‌త్యేకంగా సెట్స్ రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టులో ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here