Home Movie News ప్ర‌భాస్ మ్యారేజ్ ఎనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్..!

ప్ర‌భాస్ మ్యారేజ్ ఎనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్..!

168
0
prabhas-youtube_650x400_51516506889

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి వార్త గురించి గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి కానీ..అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెప్పారు కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రూపొందుతోంది.  ఈ సినిమా షూటింగ్ లో ఉండ‌గానే మ‌రో వైపు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాను ఇటీవ‌ల ప్రారంభించాడు ప్ర‌భాస్.ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… అక్టోబ‌ర్ 23న  ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఆ రోజున ప్ర‌భాస్ పెళ్లి గురించి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎప్ప‌టి నుంచో  అభిమానులు ప్ర‌భాస్ పెళ్లి వార్త గురించి ఎదురుచూస్తున్నారు. మ‌రి…అభిమానుల కోరిక‌ ఆ రోజున తీరుతుందేమో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here