Home Movie News ప్ర‌భాస్ సాహో మేకింగ్ వీడియో అదిరింది..!

ప్ర‌భాస్ సాహో మేకింగ్ వీడియో అదిరింది..!

95
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే…ఈ మూవీ అప్ డేట్స్ కోసం డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈరోజు ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్ట‌ర్ 1 పేరుతో సాహో మేకింగ్ రిలీజ్ చేసారు.

ఇందులో ప్ర‌భాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్దాక‌పూర్ క‌నిపించారు. ఈ వీడియోలో చూపించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చూస్తుంటే..ప్రేక్ష‌కులు వావ్ అనేలా యాక్ష‌న్ సీన్స్ అందించేందుకు టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అనిపిస్తుంది. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగించ‌డం ఖాయం అని చెప్ప‌చ్చు. ఈ వీడియో చివ‌ర‌లో ప్ర‌భాస్ వాకింగ్ స్టైల్..దీనికి త‌గ్గ‌ట్టు మ్యూజిక్ చూసే కొద్దీ మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే సాహో మేకింగ్ వీడియో అదిరింది..!

దాదాపు 300 కోట్ల‌తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ భారీ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌ధ‌మార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి..మేకింగ్ వీడియోనే ఇలా ఉంటే..ఇక సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here