Home Actor ప్ర‌భాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్..?

ప్ర‌భాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్..?

162
0

బాహుబలి 1, బాహుబ‌లి 2  చిత్రాల‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ప్రభాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

యువి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…ఇటీవ‌ల ముంబాయిలో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖ‌రున ప్ర‌భాస్ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నార‌ని తెలిసింది. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేస్తున్నారు.

ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here