Home Actor ప్ర‌భాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్..?

ప్ర‌భాస్ సాహో లేటెస్ట్ అప్ డేట్..?

149
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్నలేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో సాహో పై భారీ స్ధాయిలో అంచ‌నాలు ఉన్నాయి. అయితే…అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా.. నిర్మాణ ప‌రంగా రాజీప‌డ‌కుండా.. మంచి క్వాలిటీతో యు.వి. క్రియేష‌న్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే….హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఎక్కువుగా ఉండ‌డంతో గ్రాఫిక్స్ వ‌ర్క్ కి ఎక్కువ టైమ్ అవుతుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింద‌ని తెలిసింది. జూన్ కి షూటింగ్ కంప్లీట్ చేసి.. జూలై నుంచీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రం సాహో ని  ఆగస్ట్ 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here