Home Movie News ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు బి.జ‌య ఇక లేరు..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు బి.జ‌య ఇక లేరు..!

102
0
b jaya died

ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కురాలు బి.జ‌య గురువారం రాత్రి 9.20 నిమిషాల‌కు గుండెపోటుతో మ‌ర‌ణించారు. పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జయ..తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం సూపర్‌ హిట్‌ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు. 2003లో ద‌ర్శ‌కురాలిగా మారి తొలి ప్ర‌య‌త్నంగా చంటిగాడు సినిమాను తెర‌కెక్కించి మంచి విజయం సాధించారు.ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్లీ..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, విక్ట‌రీ వెంక‌టేష్, న‌రేష్, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, పూరి జ‌గ‌న్నాథ్, గుణ‌శేఖ‌ర్, సుకుమార్,  వి.ఎన్.ఆదిత్య‌, మ‌నోజ్, జీవిత‌, మారుతి, నందినిరెడ్డి,  అనిల్ రావిపూడి, ఉత్తేజ్, ఝాన్సీ, హేమ‌, సుహాసిని త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు ఆమె మ‌ర‌ణం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here