Home Movie News ప‌డి ప‌డి లేచె మ‌న‌సు టీజ‌ర్ అదిరింది..!

ప‌డి ప‌డి లేచె మ‌న‌సు టీజ‌ర్ అదిరింది..!

96
0

యువ హీరో శ‌ర్వానంద్ – వైవిధ్య‌మైన క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. ఈ సినిమా టీజర్ ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. నాయాకా నాయికల కాంబినేషన్లోని సన్నివేశాల పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో మెడికోగా సాయిపల్లవి కనిపిస్తోంది. శర్వానంద్ ఆమెను ఫాలో చేయడం .. అది గమనించి ఆమె నిలదీయడం ఈ టీజర్ లో చూపించారు.

యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అఫిష‌యిల్ గా ఎనౌన్స్ చేసారు. వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న శ‌ర్వానంద్ – మంచి క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటున్న సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌డి ప‌డి లేచె మ‌న‌సు విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here