Home Actor ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

41
0
ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..? spiceandhra

గీత గోవిందం సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన ప‌ర‌శురామ్ తో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు చాలా మంది ఇంట్ర‌స్ట్ చూపించారు. దీంతో ప‌ర‌శురామ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంది అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. గీతా ఆర్ట్స్ లోనే ఉంటుంద‌ని..బ‌న్నీతో ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ప‌ర‌శురామ్ మ‌హేష్ కి క‌థ చెప్ప‌డం.. క‌థ విని మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌నే టాక్ వ‌చ్చింది.

అయితే.. మ‌హేష్ ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో ప‌ర‌శురామ్ తో మ‌హేష్ సినిమా చాలా టైమ్ ప‌డుతుంది. అందుచేత ప‌ర‌శురామ్ మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఇటీవ‌ల క‌థ విని విజ‌య్ ప‌ర‌శురామ్ కి ఓకే చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ప‌ర‌శురామ్ మాత్రం ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై స్పందించ లేదు కానీ… తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్, విజ‌య్ కాకుండా మ‌రో హీరోకి క‌థ చెప్పేందుకు ప్ర‌యత్నిస్తున్నార‌ట‌. ఏ హీరో ఓకే అంటే.. ఆ హీరోతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి.. ప‌ర‌శురామ్ కథ‌కి ఏ హీరో ఓకే చెబుతాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here