Home Actor ప‌లాస‌లో అల్లుడు ట్యాక్స్… న‌ర‌స‌రావుపేట‌లో కొడుకు ట్యాక్స్

ప‌లాస‌లో అల్లుడు ట్యాక్స్… న‌ర‌స‌రావుపేట‌లో కొడుకు ట్యాక్స్

82
0

వేల‌ కోట్లు ఉంటే ముఖ్య‌మంత్రులు అయిపోతారు అంటే చాలా మంది కుబేరులు ముఖ్య‌మంత్రులు అయ్యేవారు. ముఖ్య‌మంత్రి కావాలంటే కిరాయి మూక‌లు, రౌడీయిజం, వేల కోట్లు ఆస్తులు కాదు కావాల్సింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల పై బ‌లంగా మాట్లాడే భావ‌జాలం కావాలి అని న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. 32 ల‌క్ష‌ల ట‌న్నుల సున్న‌పురాయి గ‌నుల‌ను అక్ర‌మంగా త‌వ్వేస్తే ఎవ‌రూ మాట్లాడ‌రు. చట్ట సభల నుంచి భయపడి పారిపోతున్నారు.  ప్ర‌భుత్వ ఖ‌జానాకు కోట్లు గండిప‌డుతుంటే స్థానిక ఎమ్మెల్యే ప్ర‌శ్నించ‌కుండా ఇంట్లో కూర్చుంటారు. ఇంత అన్యాయం జ‌రుగుతుంటే గొంతెత్తి బ‌లంగా నిల‌దీయ‌డానికి ఒక్క‌రు కూడా లేరు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే గానీ రాన‌ని ప‌ట్టుప‌ట్టి కూర్చున్నారు..? మ‌రి అక్ర‌మ మైనింగ్ పై ప్ర‌శ్నించేదెవ‌రు..? జ‌న‌సేన పార్టీ ప్ర‌శ్నిస్తుంది. ఇన్ కంట్యాక్స్ , ప్రోఫెషన‌ల్ ట్యాక్స్ , మున్సిప‌ల్ ట్యాక్స్ ల‌తో విసుగిపోతున్న ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు కొత్త‌గా కొడుకు ట్యాక్స్ వ‌సూలు చేయ‌డం బాధ‌క‌రం . అస‌లు కొడుకు ట్యాక్స్ ఏంటి దారుణం కాక‌పోతే..? పోరాట‌యాత్ర మ‌లి ద‌శ‌కు చేరింది. ఎక్క‌డో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించాం. ప‌ల్నాడులో ముగించాం. జ‌న‌సేన పార్టీ పెట్టింది ముఖ్య‌మంత్రి అయిపోదామ‌నో, అద్భుతాలు చేస్తాన‌నో కాదు.

తెలంగాణ ప్రాంత నాయ‌కులు ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను దోపిడి దారులుగా చిత్రీక‌రించి తిడుతూ ఉంటే సోకాల్డ్ ప‌ల్నాడు నాయ‌కులు అని చెప్పుకునే వారు ఎవ‌రూ నోరెత్త‌లేదు. సొంత ప్రాంత ప్ర‌జ‌లు మీద మాత్రం కిరాయి మూక‌ల‌తో దాడులు చేయిస్తూ భ‌య‌పెట్టి బ‌తుకుతున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టిన వాడిగా, ప‌ల్నాడు పౌరుషం నింపుకున్న‌వాడిగా, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కోసం, తెలుగుజాతి ఐక‌త్య‌కోసం పార్టీ పెట్టాను అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here