Home News ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని సీఎం చేస్తే..అంద‌రి జీవితాలు బాగుంటాయి – రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ జ‌న‌సేన‌...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని సీఎం చేస్తే..అంద‌రి జీవితాలు బాగుంటాయి – రాజ‌మండ్రి అర్బ‌న్ అసెంబ్లీ జ‌న‌సేన‌ అభ్య‌ర్థి అత్తి స‌త్య‌నారాయ‌ణ‌..!

84
0


రాజ‌మండ్రిలోని జ‌న సైనికులంద‌రితో క‌లిసి ప్ర‌తి ఇంటింటికి వెళ్లి జ‌న‌సేన సింబ‌ల్ గాజు గ్లాస్ ని ప్ర‌తి ఇంటికి ఇవ్వ‌డం..గాజు గ్లాసు యొక్క గొప్ప‌త‌నాన్ని కూడా తెలియ‌చేయ‌డం జ‌రుగుతోందని అర్బన్ అసెంబ్లీ అభ్య‌ర్థి అత్తి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్పుడు మూడు ప్ర‌ధాన పార్టీలు ఉన్నాయి. ఈ మూడు ప్ర‌ధాన పార్టీల గుర్తులు చూసుకుంటే..చంద్ర‌బాబు నాయుడు గారిది సైకిల్ గుర్తు. అది స్వ‌యంగా వ‌చ్చింది కాదు. ఎవ‌రి ద‌గ్గ‌రో లాక్కుని తెచ్చుకున్న‌దే.

జ‌గ‌న్ గారి గుర్తు ఫ్యాన్ గుర్తు. ఈ ఫ్యాన్ గుర్తు ఆయ‌న మెంటాలిటికి సంబంధించిందే. ఎందుకంటే…ఎవ‌రైనా ఏదైనా ప‌ని చేయండి అంటే..సీఎం అయితే చేస్తానంటాడు. ఫ్యాన్ తిర‌గాలంటే ప‌వ‌ర్ ఉండాలి. అందుచేత ఆయ‌న మెంటాలిటికి సంబంధించి ఫ్యాన్ గుర్తు వ‌చ్చింది అన్నారు. ఒక్క‌ళ్లు దొంగ‌త‌నంగా తెచ్చుకున్న గుర్తు. మ‌రొక‌రు ప‌వ‌ర్ ఉంటేనే కానీ తిర‌గ‌ని ఫ్యాన్ గుర్తు కానీ…మా పార్టీ జ‌న‌సేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు. సామాన్యుడు ప్ర‌తి ఒక్క‌రు టీ తాగుతారు. అంద‌రికీ చేరువ‌లో ఉండేది గాజు గ్లాసు అని అత్తి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌చేసారు.

ఈ గ్లాసులో ఏది వేసుకుంటే అది క‌నిపిస్తుంది. పాలు వేస్తే పాలు..నీళ్లు వేస్తే నీళ్లు..టీ వేస్తే టీ క‌న‌ప‌డుతుంది. అలాగే మా నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి మ‌న‌స్త‌త్వం కూడా అద్దంలా ఉంటుంది. ఆయ‌న కొన్ని కోట్ల సంపాద‌న వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అందుచేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని సీఎంని చేస్తే మ‌నందరి జీవితాలు బాగుంటాయి. అందుచేత ప్ర‌తి ఒక్క‌రు గాజు గ్లాస్ కి ఓటు వేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్ని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అని చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here