Home Telugu ప‌వ‌న్ ని మ‌ళ్లీ కెలికిన వ‌ర్మ – ఈసారి వ‌ర్మ‌కి కౌంట‌ర్ ఇచ్చిన శాస్త్రి..!

ప‌వ‌న్ ని మ‌ళ్లీ కెలికిన వ‌ర్మ – ఈసారి వ‌ర్మ‌కి కౌంట‌ర్ ఇచ్చిన శాస్త్రి..!

199
0

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ట్వీట్ చేయ‌డం అంటే వ‌ర్మ‌కి ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వ‌ర్మ‌ ప‌వ‌న్ పై పెట్టే దృష్టి సినిమా తీయ‌డం పై పెట్టుంటే…ఎప్పుడో హిట్టు సినిమా తీసుండేవాడు అనే వాళ్లు లేక‌పోలేదు. మెగా హీరోల‌ను టార్గెట్ చేసినంత‌గా వ‌ర్మ ఇంకెవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లు…వ‌ర్మ కి మెగా హీరోల‌కి మ‌ధ్య గొడ‌వ ఏంటి..? అని ఆలోచిస్తే…అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవితో వ‌ర్మ ఓ సినిమాని ప్రారంభించ‌డం…ఈ మూవీ కోసం చిరు పై సాంగ్స్ పిక్చ‌రైజ్ చేయ‌డం కూడా జ‌రిగింది. ఈ సినిమాకి అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ…ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

చిరు  హీరోగా వ‌ర్మ డైరెక్ష‌న్ లో చిత్రీక‌రించిన పాట‌ల‌ను చూడాల‌నివుంది సినిమాలో యాడ్ చేసారు. మెగాస్టార్ తో వ‌ర్మ తీయాల‌నుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్లిన‌త‌ర్వాత ఆగిపోయింది. ఆత‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా తీయాల‌నుకుని వ‌ర్మ క‌థ చెప్ప‌డం జ‌రిగింద‌ట. కానీ…ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈ రెండు కార‌ణాల వ‌ల్లే వ‌ర్మకు మెగా హీర‌లంటే కోపం అని చెప్ప‌లేం. మ‌రి ఇంకేదైనా జ‌రిగిందా..?  అస‌లు ఎందుకు ఇంత కోపం అనేది వ‌ర్మ‌కే తెలియాలి.

ఇటీవ‌ల శ్రీరెడ్డితో ప‌వ‌న్ ని తిట్టించిన సంగ‌తి త‌నే స్వ‌యంగా బ‌య‌ట పెట్ట‌డం..అమ్మ మీద ఒట్టు వేసి చెబుతున్నా..క్ష‌మించండి ఇక నుంచి మెగా హీరోల గురించి నెగిటివ్ గా కామెంట్ చేయ‌ను అని వ‌ర్మ ట్వీట్ చేయ‌డం తెలిసిందే. ఆత‌ర్వాత అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..వ‌ర్మ‌ని తిట్ట‌డంతో..ఒట్టు తీసి గ‌ట్టు మీద పెట్టాను అంటూ త‌న‌దైన స్టైల్ లో మాట మార్చేసాడు వ‌ర్మ‌. ఇక అక్క‌డ నుంచి మ‌ళ్లీ ప‌వ‌న్ కెల‌క‌డం మొద‌లుపెట్టాడు.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ర‌వితేజ న‌టించిన నేల టిక్కెట్ ఆడియో ఫంక్ష‌న్ కి గెస్ట్ గా వెళ్లాడు. అక్క‌డ ప‌వ‌న్ ర‌వితేజ జీన్ ఫ్యాంటుని ట‌చ్ చేసి ఏం చేసాడో వ‌ర్మ ట్వీట్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌న్నాడంటే….అజ్ఞాత‌వాసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో ఈ యాంగిల్ కూడా ఉంద‌ని ఎక్స్ ప్రెస్ బ‌ట్టి ర‌వితేజ ముఖంలో క్లియ‌ర్ గా ట‌చ్ చేసి చూడు టైప్ లో తెలుస్తుంది కానీ..ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి జ‌న‌సేన పార్టీకి కూడా తెలిసుండ‌దు. బ‌ట్ పీకే గిల్లిల్లులో నేల టిక్కెట్ లా క‌నెక్ష‌న్ లు క‌నిపిస్తున్నాయి అంటూ ట్వీట్ చేసాడు.

అంతే కాకుండా.. ఇటీవ‌ల తిరుప‌తి వెళ్లిన ప‌వ‌న్  కాలిన‌డ‌క‌న వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ ఫోటో ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ ప‌వ‌ర్ ఫుల్ ఎన‌ర్జీ అంటూ ట్వీట్ చేసారు. వ‌ర్మ ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ట్వీట్ చేయ‌డం పై కామ‌న్ మేన్స్ మాత్ర‌మే కాకుండా..ఈసారి సెల‌బ్రెటీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి స్పందిస్తూ…కెలకమాకు సామీ …కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు …ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి అంటూ ట్వీట్ చేసారు.  వివాదాల‌కు దూరంగా ఉండే…రామ‌జోగ‌య్య శాస్త్రి ఎప్పుడూ వివాదాల్లో ఉండే వ‌ర్మ ట్వీట్ పై కామెంట్ చేయ‌డం విశేషం. ఎవ‌రు ఏం చెప్పినా….వ‌ర్మ ఎవ‌రి మాట విన‌డు…ప‌వ‌న్ ని కెల‌క‌డం మాన‌డు..!

 


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here