Home Actor ప‌వ‌న్ – బోయ‌పాటి కాంబినేష‌న్ లో మూవీ నిజ‌మేనా..?

ప‌వ‌న్ – బోయ‌పాటి కాంబినేష‌న్ లో మూవీ నిజ‌మేనా..?

114
0

జ‌న‌సేన పార్టీ స్ధాపించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోర ప‌రాజ‌యాన్ని పొందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాలు చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ ద‌గ్గ‌ర కొన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల అడ్వాన్స్ లు ఉన్నాయ‌నీ..త‌ప్ప‌కుండా ప‌వ‌న్ సినిమాల్లో న‌టించ‌డం ఖాయ‌మ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే…ప‌వ‌న్ తో బ్లాక్ బ‌ష్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ సినిమా చేయ‌నున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీనికి ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు అంటూ మ‌రో వార్త వ‌చ్చింది. అంతే కాకుండా… పవన్ కు రూ. 40 కోట్లు, బోయ‌పాటికి 10 కోట్లు బండ్ల గ‌ణేష్ ఆఫర్ చేశారని..దాదాపు ఈ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై బండ్ల గణేష్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బండ్ల గ‌ణేష్ ఏమ‌ని ట్వీట్ చేసారంటే… ప్ర‌చారంలో ఉన్న వార్త నిజం కాదు. ఏదైనా ఉంటే మొట్ట మొద‌ట‌ నేనే చెబుతాను అని చెప్పారు. అదీ సంగ‌తి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here